చెన్నై పై పంజాబ్ ఘన విజయం

చెన్నై పై పంజాబ్ ఘన విజయం

మొహాలీ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(71; 36 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్స్‌లు) క్రిస్‌గేల్‌(28;  28 బంతుల్లో 2x4, 2x6) రెచ్చిపోయారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించాక హర్భజన్‌సింగ్‌ బౌలింగ్‌లో వెంట వెంటనే ఔటయ్యారు. మయాంక్‌ అగర్వాల్‌(7) త్వరగానే ఔట్ అయినా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌(36; 22 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టుకు చివరి మ్యాచ్ లో విజయం అందించాడు. చెన్నై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 2 ఓవర్లు మిగులుండగానే ఛేదించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌(96; 55 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా(53; 38 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలింగ్‌లో కర్రన్ మూడు, షమీ రెండు వికెట్లు తీశారు.