పంజాబ్ టార్గెట్ః 171

 పంజాబ్ టార్గెట్ః 171

మొహాలీలోని ఐఎస్ బృందా స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణిత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫా డు ప్లెసిస్‌(96; 55 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌రైనా(53; 38 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు. పంజాబ్ బౌలింగ్‌లో కర్రన్ మూడు, షమీ రెండు వికెట్లు తీశారు.