టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కత్తా

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కత్తా

కాసేపట్లో మరో ఉత్కంఠ పోరు జరగనుంది. పంజాబ్, కోల్‌కత్తా జట్ల మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కు మొహలీ వేదిక కానుంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌కార్తిక్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. దీంతో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. పంజాబ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మిల్లర్, ముజీబ్ స్థానంలో శామ్ కర్రన్, ఏజే టై జట్టులోకి వచ్చారు. కోల్‌కతా జట్టులో ఎటువంటి మార్పులు లేవు.