కోల్ కత్తా టార్గెట్ః 184

 కోల్ కత్తా టార్గెట్ః 184

మొహాలీ వేదికగా కోల్‌కత్తాతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌కార్తిక్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కీలకమ్యాచ్ లో క్రిస్‌గేల్‌(14), కేఎల్‌ రాహుల్‌(2) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. ఈ తరుణంలో మయాంక్‌ అగర్వాల్‌(36; 26 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్), నికోలస్‌ పూరన్‌(48; 27 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్స్‌లు)  మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. వీరిద్దరూ వెనువెంటనే ఔటైనా మన్‌దీప్‌సింగ్‌(25; 17 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్), సామ్‌కరన్‌(55; 24 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్స్‌లు) చెలరేగి ఆడారు. ఆఖరి ఓవర్‌లో కరన్‌ 22 పరుగులు సాధించాడు. 

కాగా పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. దీంతో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. పంజాబ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మిల్లర్, ముజీబ్ స్థానంలో శామ్ కర్రన్, ఏజే టై జట్టులోకి వచ్చారు. కోల్‌కతా జట్టులో ఎటువంటి మార్పులు లేవు.