రాజస్థాన్ రాయల్స్ టార్గెట్: 183

రాజస్థాన్ రాయల్స్ టార్గెట్: 183

మెహాలీలో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (52; 47 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డేవిడ్‌ మిల్లర్‌ (40; 27 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్), ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ (30; 22 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్), మయాంక్‌ అగర్వాల్‌ (26; 12 బంతుల్లో 1ఫోర్, 2సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. చివర్లో అశ్విన్(17) బ్యాట్ ఝుళిపించడంతో రాజస్థాన్ ముందు 183 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కులకర్ణీ, ఉనద్కట్, సోదీ తలో వికెట్ తీశారు.