12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం

12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం

మొహాలీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేసింది. రాహుల్‌ త్రిపాఠి 50 (45 బంతుల్లో 4ఫోర్లు) పరుగులు సాధించి టాప్‌స్కోరర్ గా నిలిచాడు‌. మురుగన్‌ అశ్విన్ ఒక వికెట్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్శదీప్ సింగ్‌, మహమ్మద్ షమీ తలో రెండు వికెట్లు తీసి రాయల్స్ ను కట్టడి చేశారు. అంతకుముందు రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్‌ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (52; 47 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.  డేవిడ్‌ మిల్లర్‌ (40; 27 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్), ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ (30; 22 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్స్), మయాంక్‌ అగర్వాల్‌ (26; 12 బంతుల్లో 1ఫోర్, 2సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. చివర్లో అశ్విన్(17) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ కు 183 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. రాజస్థాన్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కులకర్ణీ, ఉనద్కట్, సోదీ తలో వికెట్ తీశారు. కెప్టెన్‌గానూ పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌ కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.