గేల్ వీరవిహారం.. పంజాబ్ 173/4 

గేల్ వీరవిహారం.. పంజాబ్ 173/4 

మొహాలీ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ XI పంజాబ్‌ ఆటగాడు గ్రిస్ గేల్ (99, 64 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సులు) వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్‌ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(18), మయాంక్‌ అగర్వాల్‌(15), సర్ఫరాజ్‌ఖాన్‌(15) తక్కువ పరుగులకే ఔటైనా గేల్‌ నిలకడగా ఆడాడు. చాహల్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికి రాహుల్(18) స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మయాంక్ అగర్వాల్(15) చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే  సర్ఫరాజ్ ఖాన్(15) సిరాజ్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. గేల్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో మన్‌దీప్‌సింగ్‌(18) సహకరించడంతో బెంగళూరు జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. బెంగళూరు బౌలింగ్‌లో చాహల్ 2, సిరాజ్, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు.