ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ విక్టరీ..

ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ విక్టరీ..

ఐపీఎల్ 2019లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 150 పరుగులు చేసి.. పంజాబ్ ముందు 151 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది... ఆ జట్టు సమష్టిగా ఆడిన వేళ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 70 (నాటౌట్‌) టాప్ స్కోరర్‌గా  నిలిచాడు. ఇక రాహుల్‌ 71 (నాటౌట్‌)తో పాటు మయాంక్‌ అగర్వాల్‌ 55  పరుగులతో సత్తా చాటడంతో 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది పంజాబ్. కాగా, సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా... ఈ సీజన్‌లో మూడోది. పాయింట్ల  పట్టికలో హైదరాబాద్ జట్టు 6 పాయింట్లతో నాల్గో స్థానానికి పడిపోయింది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌: వార్నర్‌ 70 (నాటౌట్‌), బెయిర్‌స్టో 1, విజయ్‌ శంకర్‌ 26, నబి 12, పాండే 19, హుడా 14 (నాటౌట్‌)
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాటింగ్‌: కేఎల్‌ రాహుల్‌ 71 (నాటౌట్‌), గేల్‌ 16, మయాంక్‌ 55, మిల్లర్‌ 1, మన్‌దీప్‌ 2, కరన్‌ 5