ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతుంది. అయితే అందులో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ ఏడాదే కెప్టెన్ గా బాధ్యతలు చేప్పట్టిన రాహుల్ తన జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడు అనేది మాజీ ఆటగాళ్లతో పాటుగా అభిమానులు కూడా చూడాలనుకుంటున్నారు. పంజాబ్ జట్టులో ఉన్న సూపర్ హిట్టర్ గేల్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. ఇక ఇంతకముందు పాంటింగ్ చెప్పిన విధంగానే రహానేకు ఢిల్లీ తుది జట్టులో స్థానం దక్కలేదు. అలాగే గాయం కారణంగా ఇషాంత్ శర్మ కూడా ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు.

ఢిల్లీ జట్టు : శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (wk), షిమ్రాన్ హెట్మీర్, మార్కస్ స్టోయినిస్,అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జే, మోహిత్ శర్మ

పంజాబ్ జట్టు : లోకేష్ రాహుల్ (c/wk), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మాక్స్వెల్, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, క్రిస్ జోర్డాన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ