అమర వీరులకు కిషన్ రెడ్డి నివాళి

అమర వీరులకు కిషన్ రెడ్డి నివాళి

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇవాళ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఉన్న వార్ మెమోరియల్ ను సందర్శించి అమర జవాన్ల స్థూపానికి పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. దేశానికి జవాన్లు చేసిన సేవలను అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించడం ఎంతో సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. వార్ మెమోరియల్ సందర్శన ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని చెప్పారు. దేశంలో ఉండే యువత వీర జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలందరూ ఈ ప్రదేశాన్ని సందర్శించాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి, అమర జవాన్ల కుటుంబాలకు యావద్దేశంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.