బాబుకు ఆ అర్హత లేదు: కిషన్‌రెడ్డి

బాబుకు ఆ అర్హత లేదు: కిషన్‌రెడ్డి

రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహన్‌రావులు బీజేపీలో చేరికపై కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఆ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశం లేదన్న ఆయన.. నిబంధనల ప్రకారం వేరే పార్టీలో చేరుతామంటే ఆపే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ రాజ్యంగబద్ధంగానే జరిగిందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ విషయంలో విమర్శలు చేసే అర్హత లేదన్నారు కిషర్‌రెడ్డి.