అలా జరిగుంటే... టీఆర్‌ఎస్‌ సింగిల్‌ డిపాజిట్‌ వచ్చేది...

అలా జరిగుంటే... టీఆర్‌ఎస్‌ సింగిల్‌ డిపాజిట్‌ వచ్చేది...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. . గ్రేటర్ ఎన్నికలు న్యాయ, ధర్మ బద్దంగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని...టీఆర్‌ఎస్‌కు సింగిల్ డిజిట్ మాత్రమే వచ్చేదని కిషన్‌ రెడ్డి అన్నారు.  వరంగల్ మేయర్ పీఠం బీజేపీదేనని..వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు బీజేపీనే గెలుస్తుందన్నారు.  నాగార్జున సాగర్ లో కూడా వాతావరణం మారుతుందని... సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలని సొంత పార్టీ నేతలకు సూచించారు.  కేంద్ర పార్టీ రాష్ట్రంలో అధికారములోకి రావాలని కృత నిశ్చయం తో ఉందని.. మాట తప్పే, నీతి లేని, అబద్ధాల సీఎం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌ రెడ్డి అన్నారు.   తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి మాటలను విశ్వసించే పరిస్థితి లేదని... పాత కొత్త కలయికతో కలిసి మెలిసి పని చేద్దామని పేర్కొన్నారు.  ప్రభుత్వం నిజాయితీగా పనిచేయడం లేదని.. మభ్య పెడుతుందన్నారు.   ఓడి పోయిన కార్పొరేటర్ లతో  ktr ప్రారంభోత్సవాలు చేయిస్తున్నాడని.. ట్రంప్ కి వీరికి మధ్య తేడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వం దుర్మార్గంగా పని చేస్తోంది.