ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో సీజన్ - 12లో రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో భువనేశ్వర్ తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.