ఐపీఎల్ 2020 : ప్లే ఆఫ్ ఛాన్సే టార్గెట్ గా ఆర్సీబీ, కేకేఆర్... 

ఐపీఎల్ 2020 : ప్లే ఆఫ్ ఛాన్సే టార్గెట్ గా ఆర్సీబీ, కేకేఆర్... 

ఐపీఎల్ 2020 లో ఈ రోజు కోల్‌కత, బెంగుళూర్ తలపడనున్నాయి. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ మొదలు కావడంతో ప్రస్తుతం ఈ రెండు జట్ల టార్గెట్ కూడా అదే. ఇప్పటివరకు ఐపీఎల్ 2020 లో ఆడిన 9 మ్యాచ్ లలో 5 విజయాలు సాధించిన కోల్‌కత ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. గత మ్యాచ్ లో సూపర్ ఓవర్ విక్టరీ సాధించిన కేకేఆర్ ఈ మ్యాచ్ లోను గెలిచి మూడో స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఈ జట్టు విజయాలు సాధిస్తున్న బ్యాటింగ్ లో నిలకడ ఉండటం లేదు. కెప్టెన్ మోర్గాన్, కార్తీక్ పైనే బ్యాటింగ్ భారం పడుతుంది. పవర్ హిట్టర్ రస్సెల్ ఇప్పటివరకు తన మార్క్ ను చూపించలేదు. అలాగే నరైన్ దూరమైన గత మూడు మ్యాచ్ లలో స్పిన్ బౌలింగ్ బాగా బలహీనపడింది. అయితే ఈ రోజు అతను జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక ప్రతి ఏడాది అభిమానులను నిరాశపరిచే ఆర్సీబీ ఈ ఏడాది బాగానే రాణిస్తుంది. ఐపీఎల్ 2020 లో ఆడిన 9 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించిన బెంగుళూర్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకోవాలని కోహ్లీ సేన చూస్తుంది. ఈ జట్టులో బౌలర్లు తడబడుతున్న బ్యాటింగ్ లో మాత్రం కోహ్లీ, డివిలియర్స్ అలాగే ఓపెనర్ దేవదత్ పడిక్కల్ బాగానే రాణిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కింది స్థానాల్లో మిగిత జట్ల ప్లే ఆఫ్ అవకాశాల పైన ప్రభావం చూపిస్తుంది. చూడాలి మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు  అనేది.