రెండో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ కు తప్పని ఓటమి..

రెండో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ కు  తప్పని ఓటమి..

ఐపీఎల్-2020‌లో సన్‌ రైజర్స్‌ మరో ఓటమి చవి చూసింది. అటు కేకేఆర్‌ ఐపీఎల్‌లో మొదటి  బోణీ కొట్టింది.  సన్ ‌రైజర్స్‌ హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది. దీంతో  పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది సన్‌ రైజర్స్.  యువ ఓపెనర్‌ శుభ్ ‌మన్‌ గిల్ ‌(70 నాటౌట్:‌ 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇయాన్‌ మోర్గాన్ ‌(42 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్ ‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్‌ ఏ దశలోనూ భారీ స్కోర్‌ సాధించేలా కనిపించలేదు.  143 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి కోల్ కతా వరుస ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. శుభ్‌మన్‌ గిల్‌, మోర్గాన్‌ లు దీటుగా ఆడుతూ కోల్ కతా కు విజయాన్ని అందించారు. కాగా ఇవాళ పంజాబ్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.