భారత ఆటగాళ్లలో ఒక్కేఒకడిగా కేఎల్ రాహుల్...

భారత ఆటగాళ్లలో ఒక్కేఒకడిగా కేఎల్ రాహుల్...

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జట్టులో‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. దీంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. 10 ఇన్నింగ్స్‌లలో రాహుల్ 540 రన్స్ చేశాడు. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా మూడు సీజన్‌లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2019లో 593, 2018లో 659 రన్స్ చేశాడు రాహుల్. గతంలో యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు బాదాడు.ఇక భారత క్రికెటర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు చేశాడు.