రెండో మ్యాచ్ లోనే కెప్టెన్ గా రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్...

రెండో మ్యాచ్ లోనే కెప్టెన్ గా రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్...

ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూర్ జట్టు 17 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో పంజాబ్ జట్టు 97 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకు ఔట్ కాకుండా నిలిచి 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో ఈ మ్యాచ్ లో 132 పరుగులు సాధించి ఈ ఐపీఎల్ 2020 లో మొదటి సెంచరీ నమోదు చేయడం మాత్రమే కాకుండా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అలాగే ఈ ఒక్క మ్యాచ్ లోనే చాలా రికార్డులకు కూడా రాహుల్ బ్రేక్ చేసాడు. ఈ ఐపీఎల్ సీజన్ లోనే మొదటిసారిగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రాహుల్ కు ఇది కేవలం రెండో మ్యాచ్. అయిన కూడా ఐపీఎల్ కెప్టెన్ లలో అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే... ఇప్పటివరకు ఐపీఎల్ లో రాహుల్ చేసిన 132 పరుగులే ఓ కెప్టెన్ సాధించిన అత్యధిక పరుగులు. అలాగే ఓ భారత క్రికెటర్ ఐపీఎల్ లో బాదిన అత్యధిక పరుగులు కూడా ఇవే. మొదటి రికార్డు ఇంతకముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరు మీద ఉంది. వార్నర్ 2017 లో కేకేఆర్ పైన 59 బంతుల్లో 126 పరులు చేసాడు. ఇక ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇంతకముందు మురళి విజయ్ పేరు మీద ఉంది. రాజస్థాన్ రాయల్స్ కు వ్యతిరేకంగా 2010 లో విజయ్ 127 పరుగులు సాధించాడు. కానీ ఇప్పుడు ఈ రెండు రికార్డులు కేఎల్ రాహుల్ సొంతం అయ్యాయి.