లోకేష్ హాఫ్ నాలెడ్జ్..పార్టీ నడపడం రాదు..ట్రాక్టర్ కూడా

లోకేష్ హాఫ్ నాలెడ్జ్..పార్టీ నడపడం రాదు..ట్రాక్టర్ కూడా

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ గురించి మాట్లాడడం పరమ వెస్ట్ అని...దొంగలు పడిన ఆరు నెలలకు మొరుగుతున్నారని ఫైర్ అయ్యారు కొడాలి నాని. వరదలు ఎప్పుడు వచ్చాయి..ఎప్పుడు పంటలను పరిశీలిస్తున్నారని లోకేష్ పై మండిపడ్డారు. లోకేష్ హాఫ్ నాలెడ్జ్..పార్టీ నడపడం రాదు..అంతే కాదు ట్రాక్టర్ కూడా నడపడం రాదని సెటైర్ వేశారు కొడాలి నాని.  లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో అదే విధంగా తెలుగుదేశం పార్టీని  కూడా దించుతాడని ఎద్దేవా చేశారు. బుద్ది ఉన్నోళ్లు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుంచి..పార్టీ నుంచి లోకేష్ గురించి మాట్లాడటం పరమ వెస్ట్ అని పేర్కొన్నారు. కాగా..ఆకివీడు పోలీస్ స్టేషన్ లో నిన్న లోకేష్ పై కేసులు నమోదయ్యాయి. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద అవగాహన లేకుండా  ట్రాక్టర్ నడుపుతూ.. పది మందిని ట్రాక్టర్ ఎక్కించుకుని,  వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా డ్రైవింగ్ చేసారని ఒక కారణంగా అలానే  కోవిడ్  19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకు మరో కారణంగా సుమోటోగా కేసులు నమోదు చేసారు. అయితే దీనిపై  నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు.