ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు... ఎప్పుడంటే...

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు... ఎప్పుడంటే...

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా పడిపోయింది.  37 సంవత్సరాల్లో ఎప్పుడు ఈస్థాయిలో పరాజయం పాలుకాలేదు.  తెలుగుదేశం పార్టీ తిరిగి బలం పుంజుకోవాలి అంటే ఆ పార్టీకి బలమైన నేతలు అవసరం అని.. ఈ సమయంలో ఎన్టీఆర్ కు బాధ్యతలు అప్పగించాలనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.  

ఇదిలా ఉంటె, ఇంచుమించుగా ఇలాంటి వ్యాఖ్యలే కొడాలి నాని చేశారు.  గుడివాడ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కొడాలి నాని వైకాపా తరపున గెలుపొందిన సంగతి తెలిసిందే.  వరసగా నాలుగుసార్లు ఆయన విజయం సాధించారు.  ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు.  2024 వరకు తెలుగుదేశం పార్టీ కనుమరుగౌతుందని చెప్పిన నాని, ఎన్టీఆర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని.. అయితే ఇప్పుడు కాదని, 2024 తరువాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.  

కొడాలి నాని ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు.  నాని వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.