బాబు నిష్టదరిద్రుడు... ముసలి నక్క.. మళ్ళీ కొడాలి సంచలనం !

బాబు నిష్టదరిద్రుడు... ముసలి నక్క.. మళ్ళీ కొడాలి సంచలనం !

  
గత కొద్ది రోజులుగా చంద్రబాబు అంటేనే విరుచుకు పడుతున్న ఏపీ మంత్రి కొడాలి నాని మళ్ళీ చంద్రబాబు మీద విరుచుకు పడ్డాడు. బాబు నిష్టదరిద్రుడు... ముసలి నక్క అంటూ ఆయన అనుచిత కామెంట్స్ చేశారు. జగన్ ని చూసి చంద్రబాబు కుళ్లికుళ్ళి ఏడుస్తున్నాడని, గౌరవం పొందే స్థానంలో చంద్రబాబు లేడన్న నాని అందుకే నిత్యం తిడుతున్నానని అన్నారు.

ఈ రోజు తిరుమల డిక్లరేషన్స్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన చంద్రబాబును రోడ్డుమీద ప్రజలు అమ్మా బూతులు తిడుతున్నారని అన్నారు. అలానే దేవాలయాల పై వరుస ఘటనల విషయంలో టీడీపీ నేతల పై అనుమానాలు ఉన్నాయని అన్నారు. పోలీసుల నుంచి ఆమేరకు సమాచారం కూడా మాకు ఉందని అన్నారు. 10 కేజీల వెండి బొమ్మలు ఎత్తుకు పోతే...కోటి రూపాయల రథం పోతే దేవుడికి పోయేది ఏమి లేదని నాని అన్నారు. హిందువులకు మేము ఛాంపియన్ లు అని చెప్పుకునేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.