ఈ ఘటనలు కేసీఆర్‌ అసహనానికి నిదర్శనం..

ఈ ఘటనలు కేసీఆర్‌ అసహనానికి నిదర్శనం..

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఇవాళ హన్మకొండలో ఆయన మాట్లాడుతూ ప్రజాకూటమి అభ్యర్థులపై కావాలనే రాత్రివేళ దాడులు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం సరైంది కాదన్న కోదండరామ్‌... రేవంత్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. గజ్వేల్‌లో వంటేరు ప్రతాపరెడ్డి విషయంలోనూ ఇదే తరహాలో పోలీసులు ప్రవర్తించారని ఆయన గుర్తుచేశారు. రేవంత్‌ అరెస్టు టీఆర్‌ఎస్‌ అసహనానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు జరుగుతాయని ముందే ఊహించామన్నారు. ఎమర్జెన్సీలో లేని ఉల్లంఘనలు ఇప్పుడు జరుగుతున్నాయన్న కోదండరామ్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.