ఢిల్లీలో తెలంగాణ ఒంటరి..

ఢిల్లీలో తెలంగాణ ఒంటరి..

ఢిల్లీలో తెలంగాణ సమస్యలను ప్రస్తావించే నేతలు కరువయ్యారని, దేశ రాజధానిలో తెలంగాణ ఒంటరి అయిపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. ఇవాళ వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 46 శాతం మంది రైతులకు పాస్‌బుక్‌లు రాలేదని కోదండ అన్నారు. చాలా మంది రైతులు భూములపై హక్కులు కోల్పోయే దుస్థితి నెలకొందని చెప్పారు.