మూడో ఫ్రంట్ కేసీఆర్ అత్యాశ..!

మూడో ఫ్రంట్ కేసీఆర్ అత్యాశ..!

మూడో ఫ్రంట్ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యాశగా అభివర్ణించారు టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో సమస్యల నుండి తప్పించుకోవడానికి కేసీఆర్ బయట తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. బీజేపీ, కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాలు ఏర్పడతాయా? అని ప్రశ్నించిన కోదండరాం... ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయని.. ఓట్ల లెక్కింపు తర్వాత... కూటమి క్రియాశీలక పాత్ర పోషించబోతోందని స్పష్టం చేశారు. జగన్, కేసీఆర్ మాత్రమే బయట ఉన్నారన్న కోదండరాం... మూడో ఫ్రంట్ చివరి వరకు నిలబడేది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌కి వచ్చి రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

ఇంటర్మీడియట్ బోర్డ్ వైఫల్యాలపై రేపు నిరసన దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు కోదండరాం... త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పనిచేయటం లేదని విమర్శించిన ఆయన.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన ఎందుకు అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూపరిపాలన శాఖని బలోపేతం చేయాలని.. కోనేరు రంగారావు సిఫారసులు అమలు చేయాలని... హడావుడిగా రెవెన్యూ సంస్కరణలు తేవడం సరికాదని సూచించారు. దీనిపై అఖిలపక్షంతో చర్చ ముందుకు వెళ్లాలని... రెవెన్యూశాఖలో అవినీతి ఉన్నది అనేది అందరూ అంగీకరించేదే.. కానీ, సంస్కరణలు ఎక్కడి నుండి మొదలు అవుతాయన్నది ముఖ్యమం అన్నారు కోదండరాం.