తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుంది

తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుంది

ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబపాలన జరుగుతుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా తెలంగాణ జనసమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ది చేయడంలో పాలకులు విఫలమయ్యారని, పల్లె ప్రగతి నిద్ర పేరుతో మధుసుధనా చారి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఇసుకమాఫియా జరుగుతుందని కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ టజేఎస్ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వంపై బహిరంగానే విమర్శలు చేస్తున్నారు.