ఆ బాధ్యత ఎన్నికల కమిషన్‌దే..

ఆ బాధ్యత ఎన్నికల కమిషన్‌దే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలు ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి... అయితే, ఈవీఎంలపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉందన్నారు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం... నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర వ్యాప్తంగా 31 నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన పోలైన ఓట్లకు కౌంట్ చేసిన ఓట్లకు వ్యత్యాసం ఉందన్నారు. వాస్తవంగా ఒక్క ఓటు కూడా తేడా రాకూడదు... వ్యత్యాసం కారణంగానే మాకు అనుమానాలు వచ్చాయన్నారు కోదండరాం. ఇంత జరుగుతున్న ఒక సంతృప్తికరమైన సమాధానం ఎన్నికల కమిషన్ ఇవ్వలేకపోయిందని మండిపడ్డ ఆయన... ఎన్నికల కమిషన్ ఇదే విధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియపై ఉంటే నమ్మకం కోల్పోవాల్సి వస్తుంది... ఇది చాలా ప్రమాదరం అన్నారు. ఎన్నికల కమిషన్‌లో చాలా పొరపాట్లు జరిగాయని ఆరోపించిన కోదండరాం... ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు చోటుచేసుకున్నాయి... చాలా మంది ఓటర్లు పేర్లు గల్లంతయ్యాయి.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రకరకాల వ్యత్యాసాలు కనబడ్డాయన్నారు. అనుమానాలను నివృత్తి చేసే విషయంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతమైన వైఖరితో వ్యవహరించాలని కోరారు కోదండరాం.