చాడ, కోదండరామ్‌ హౌస్‌ అరెస్ట్‌..!

చాడ, కోదండరామ్‌ హౌస్‌ అరెస్ట్‌..!

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ఇంటర్‌ బోర్డు వద్ద అఖిలపక్షం నేతలు ఆందోళన తలపెట్టారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు కలిసి ఇవాళ ఇంటర్‌ బోర్డును ముట్టడించాలని నిర్ణయించాయి. ఈక్రమంలో ఆయా పార్టీల నేతలను ముందుస్తుగా హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. తెలంగాణ జన సమితి నేత కోదండరామ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నేత అంజన్‌కుమార్‌యాదవ్‌లను పోలీసులు గృహనిర్బంధం చేశారు.