ఎన్నికల బరిలో కోదండరాం.. అక్కడి నుంచి పోటీ

ఎన్నికల బరిలో కోదండరాం.. అక్కడి నుంచి పోటీ

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మళ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని టీజేఎస్‌ నిర్ణయించింది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి కచ్చితంగా కోదండరాం బరిలో నిలుస్తారని...  ఈ మేరకు తదుపరి సమావేశంలో నిర్ణయం జరగడం సూత్రప్రాయమే అని పలువురు టీజేఎస్‌ నేతలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ నుంచి పార్టీ అధ్యక్షుడు కోదండరాం పోటీ చేయాలని నేతలు అన్నారు. అయితే ఏ నిర్ణయమైనా పార్టీ సమిష్టిగా తీసుకోవాలని కోదండరాం స్పష్టం చేశారు. దీంతో వీలైనంత త్వరగా మరోసారి సమావేశమై అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.