రేపు కోడెల వర్థంతి.. కుమారుడికి నోటీసులు

రేపు కోడెల వర్థంతి.. కుమారుడికి నోటీసులు

రేపు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తొలి వర్థంతి జరగనుంది. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనల పేరుతో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ మేరకు కోడెల తనయుడు శివరాంకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలులేదని నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు యథావిధిగా అన్ని కార్యక్రమాలు చేపడతామని కోడెల శివరాం ప్రకటించారు. వైసీపీ సభలకు లేని అడ్డంకులు మాకే ఏందుకని శివరాం ఆగ్రహంచారు.