కోడెల మృతిపై స్పందించిన కూతురు..

కోడెల మృతిపై స్పందించిన కూతురు..

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఓవైపు రాజకీయ దుమారం కూడా రేగుతోంది. అయితే, కోడెల ఆత్మహత్య ఘటనపై ఆయన కూతురు విజయలక్ష్మి స్టేట్‌యెంట్‌ను హైదరాబాద్‌ పోలీసులు తీసుకున్నారు.. ఇవాళ ఉదయం మొదటి అంతస్తులోని గదిలోకి వెళ్లారని.. అరగంటకుపైగా కిందకు రాకపోవడంతో పైకివెళ్లినట్లు కోడెల కూతురు తెలిపారు. అమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. ఉరివేసుకుని ఉండడంతో.. గన్‌మెన్, డ్రైవర్‌ సాయంతో ఆస్పత్రికి తరలించినట్లు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు విజయలక్ష్మి.. ఇక, కోడెల ఎటువంటి సూసైడ్ నోట్ రాయలేదన్న ఆమె.. అయితే, నాన్న చాలారోజులుగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. కానీ, నాన్నగారి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు విజయలక్ష్మి.