కోడెల శివప్రసాద్ కన్నుమూత

కోడెల శివప్రసాద్ కన్నుమూత

పల్నాడు రాజకీయాల్లో తిరుగులేని నేతగా ముద్ర వేసుకున్న కోడెల శివప్రసాదరావు, అనూహ్య పరిస్థితుల్లో కొద్దిసేపటి క్రితం ఉరి వేసుకున్నారు. పల్నాడు పులిగా పేరు గాంచిన ఆయన ఉరికి వేలాడుతూ కనిపించే సరికి తొలుత ఆ దృశ్యాన్ని చూసిన సహచరులు హతాశులయ్యారని ఆ వెంటనే తేరుకుని  ఆయన్ను కిందకు దింపే సరికే శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. దీంతో ఆయనను హుటాహుటిన చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యులు వెంటిలేటర్ మీద ఉంచినా ఆయనను డాక్టర్లు కాపాడుకోలేక పోయారు. గత కొన్ని రోజులుగా, తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువు తీయాలని చూస్తున్నారని కోడెల ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి కోడెల కుమార్తె, కుమారుడిపై పలు ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంతానికి వాడుకున్నట్టుగా కోడెలపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.