ఆత్మహత్యకు ముందు కొడెల ఏం చెప్పారంటే..?

ఆత్మహత్యకు ముందు కొడెల ఏం చెప్పారంటే..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో.. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గా తన ప్రత్యేకతను చాటుకున్న కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య చేసుకోవడంతో తన అనుచరులు, టీడీపీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి ముందు.. తనపై రాజకీయంగా కక్షగట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని కుటుంబ సభ్యుల వద్ద ఇవాళ ఉదయం కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో, రాజకీయాల్లో పులిలా బతికిన తాను ఇలాంటి తలవంపులు తట్టుకోలేనని ఆయన వాయిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు గత కొంత కాలంగా కోడెల తీవ్ర మానసిక వేదనతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.