సీఎంను పక్కనబెట్టి సీఎస్‌తో పాలనా?

సీఎంను పక్కనబెట్టి సీఎస్‌తో పాలనా?

ముఖ్యమంత్రిని పక్కన బెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పరిపాలన చేయించమని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు... ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేని అధికారాలను వినియోగించి ఈసీ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఎన్నికలు జరిపించిందని ఆరోపించారు. గతంలో ఎన్నాడు లేనివిధంగా ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న కోడెల... ఎన్నికలకు ఓట్ల లెక్కింపుకు 40 రోజల వ్యవధి ఉండటం బాధాకరం అన్నారు. ఇది ప్రజాపాలనకు ఆటకం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏం చెబితే ఎన్నికల కమిషన్ ఆది చేస్తోందని ఆరోపించిన కోడెల శివప్రసాదరావు... ఇది ప్రజాస్వామ్యనికి మంచిదికాదన్నారు. కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు అని ప్రశ్నించారు. ఇవి రాష్టానికి చీకటి రోజులుగా అభివర్ణించిన స్పీకర్.. ఈసీకి వాస్తవ దృక్పథం లేకపోవడం బాధకరమన్నారు. సీఎస్‌తో రాష్ట్రాన్ని నడిపించాలనుకోవటం మంచిదికాదని.. ఇనిమెట్ల ఘటనపై నేను చిత్తశుద్ధితో ఉన్నాను.. కేసులకు నేను భయపడేదిలేదని స్పష్టం చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత కనబడ్డ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు.. ఇప్పుడు ఓడిపోతే జీవితకాలం కనబడరని ఎద్దేవా చేశారు కోడెల.