మేలు చేసినా.. కోడెలపై కక్ష సాధిస్తున్నారట..!!

మేలు చేసినా.. కోడెలపై కక్ష సాధిస్తున్నారట..!!

గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైన విషయంలో ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఈ ఆరోపణలపై ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.  అసెంబ్లీ తనకు దేవాలయం లాంటిదని, ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో పూజారిలా పనిచేశానని చెప్పారు.  హైదరాబాద్ నుంచి అసెంబ్లీని అమరావతికి తరలించిన సమయంలో కొంత ఫర్నిచర్ ను గుంటూరు, సత్తెనపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులకు తరలించారని అన్నారు.  

కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత దీనిపై లేఖ రాశానని, ఆ ఫర్నిచర్ విలువ ఎంతో లెక్కకడితే డబ్బు చెల్లిస్తానని అన్నారు.  తనపై వచ్చిన ఆరోపణల తరువాత కూడా లేఖ రాశానని కానీ, ఇప్పటి వరకు సమాధానం రాలేదని అన్నారు కోడెల.  అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అందరిని సమానంగా చూశానని, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు వేతనాలు ఎలా ఇస్తారని టిడిపి ఫిర్యాదు చేసినా.. ఎప్పుడు తన నిబంధనలను అతిక్రమించలేదని అన్నారు కోడెల.  ఎన్నో విషయాల్లో అందరికి మేలు చేశానని కానీ తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని కోడెల పేర్కొన్నారు.