కోడెల మృతి: 2 వారాల కిందటే ఆత్మహత్యాయత్నం..!

కోడెల మృతి: 2 వారాల కిందటే ఆత్మహత్యాయత్నం..!

ఆత్మహత్యాయత్నం చేసి ఇవాళ కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ఆత్మహత్యాయత్నం చేయడం మాత్రం ఇదే తొలిసారి కాదట... రెండు వారాల కిందటే మొదటిసారి ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తుండగా.. సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించడంతో అప్పుడు ముప్పు తప్పిందని చెబుతున్నారు. అయితే, ఇవాళ ఉరివేసుకున్న విషయాన్ని గుర్తించి.. ఆస్పత్రికి తరలించినా.. సకాలంలో ఆ విషయాన్ని గుర్తించలేకపోవడంతో ప్రాణాలు కాపాడలేకపోయారు. ఇక, ఆయన, బట్టలు ఆరేసే తాడుతో.. బెడ్ రూమ్‌లో ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.