అదంతా కుట్రలో భాగమే : కోడెల

అదంతా కుట్రలో భాగమే : కోడెల

తెలుగుదేశం 130కి పైగా స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కోడెల శివప్రసాద్ అన్నారు.  ఈవీఎం మిషన్లు పాడైతే వాటిని బాగుచేసే శిక్షణ కూడా అధికారులకి ఇవ్వకపోవడం ఎన్నికల కమీషన్ వైఫల్యమని మండిపడ్డారు.  40 నుండి 50 శాతం ఈవీఎం మిషన్లు మొరాయించాయి.  పోలింగ్ ఆలస్యంగా మొదలైంది.  ఎన్నడూలేని విధంగా అర్థరాత్రి 12వరకు పోలింగ్ జరిగింది.  భద్రతకు తక్కువ మంది పోలీసులను పెట్టడం కూడా కుట్రలో భాగమే అంటూ 80 శాతం దాడులకు పాల్పడిన వ్యక్తులు వైకాపా వాళ్లేనని అన్నారు.