ఆరోపణలపై స్పందించిన కోడెల

ఆరోపణలపై స్పందించిన కోడెల

స్పీకర్‌గా తానెప్పుడూ తప్పుడు పనులు చేయలేదని ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. తమ కుటుంబసభ్యులపై వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని.. ఆ ఆరోపణలపై ఒక్క ఆధారం చూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు ఇవాళ కోడెల మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. వైసీపీ నేత  విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్.. తప్పుడు కేసులు పెట్టాలని ప్రోత్సహించేలా ఉందని పేర్కొన్నారు. 

అవినీతిని అడ్డం పెట్టుకొని వేధిస్తే ఊరుకోబోమన్న ఆయన.. ఇలాంటి కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. స్పీకర్ పదవికి కళంకం తెచ్చానని విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ స్పీకర్‌గా నిస్పాక్షికంగా పనిచేశానని చెప్పారు. తన కుమారుడు శివరామకృష్ణ వ్యాపార వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నాడని.. తన ఆదేశాల మేరకు ఒకట్రెండు పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యడని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని.. పోలీసులు కూడా రక్షణ కల్పించలేకపోతున్నారని కోడెల అన్నారు.