అందుకే నాన్న ఆత్మహత్య-కోడెల కూతురు

అందుకే నాన్న ఆత్మహత్య-కోడెల కూతురు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన కుమార్తె విజయలక్ష్మి.. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కన్నీరుమున్నీరవుతూ... వేధింపుల వల్లే మా నాన్న చనిపోయారని తెలిపారు. కొడుకు, కూతురు అంటూ కేసులు పెట్టి మా నాన్నకు నరకం చూపించారని ఆవేదన వ్యక్తం చేసిన విజయలక్ష్మి... ఈరోజు నా జీవితంలో జరిగిన ఘటన ఎవరూ తీర్చలేదన్నారు. నాన్న మృతిచెందిన తర్వాత కూడా ఆయనపై రకరకాల వదంతులతో చెడు ప్రచారం చేస్తున్నారు అందుకే మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. మూడున్నర నెలల నుంచి ఆయనకు నరకం చూపిస్తున్నారు.. కనీసం ఆయన వయస్సుకైనా గౌరవం ఇవ్వలేదన్న విజయలక్ష్మి.. తప్పుడు కేసులు పెట్టి.. కొడుకు, కూతురు అంటూ వేధించారని కన్నీరుమున్నీరయ్యారు. మా నాన్న అంటే మాకు ఎంతో ప్రాణం.. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మీకు అందరికీ దండంపెడుతున్నా... కనీసం ఇప్పుడైనా మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు విజయలక్ష్మి.