బ్రేకింగ్‌: పోలీసుల అదుపులో కోగంటి..!

బ్రేకింగ్‌: పోలీసుల అదుపులో కోగంటి..!

వ్యాపారి తెల్లప్రోలు రాంప్రసాద్‌ హత్య కేసుకు సంబంధించి వ్యాపారవేత్త కోగంటి సత్యంను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో కొద్దిసేపటి క్రితం ఆయనను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంప్రసాద్‌ను తానే హత్య చేశానంటూ ఇవాళ శ్యామ్‌ అనే వ్యక్తి మీడియా ముందుకు రాగా.. శ్యామ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది కోగంటి సత్యమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కోగంటి సత్యంతో రాంప్రసాద్‌కు కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి వ్యాపారం చేసినప్పటికీ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో విభేదాలు తలెత్తి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్టు తేల్చారు.