'కోహ్లీ'కి గురిపెట్టిన రోహిత్‌శర్మ

'కోహ్లీ'కి గురిపెట్టిన రోహిత్‌శర్మ

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చాలాకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రోహిత్‌శర్మ గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇవాళ విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 891 పాయింట్లతో నంబర్‌ 1 ప్లేస్‌లో ఉండగా.. రోహిత్ శర్మ 885 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అంటే వీరిద్దరి మధ్య కేవలం 6 పాయింట్లే డిఫరెన్స్. ఈ వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ మరో భారీ ఇన్నింగ్స్‌ ఆడితే టాప్‌ ప్లేస్‌కు చేరుకోవడం ఖాయం. ఇక.. బౌలర్ల ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో టీమిండియా బౌలర్ బుమ్రా కొనసాగుతున్నాడు. 

బ్యాటింగ్‌లో ఐసీసీ టాప్‌ 5 ర్యాంకర్స్‌ వీరే..

  • విరాట్ కోహ్లి (891)
  • రోహిత్ శర్మ (885)
  •  బర్ అజామ్ (827)
  • డుప్లెసిస్ (820)
  • రాస్ టేలర్ (813)

బౌలింగ్‌లో ఐసీసీ టాప్‌ 5 ర్యాంకర్స్‌ వీరే..

  • జస్‌ప్రీత్ బుమ్రా (814)
  • ట్రెంట్‌ బౌల్ట్ (758)
  • పాట్ కమిన్స్ (698)
  • కగిసో రబాడ (694)
  • ఇమ్రాన్ తాహిర్ (683)