విరాట్‌.. సెంచరీ నంబర్ 37

విరాట్‌.. సెంచరీ నంబర్ 37

విశాఖలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం బాదాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 37వ సెంచరీ. తక్కువ స్కోర్లకే ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ధావన్‌లు ఔటైనా.. తెలుగు తేజం అంబటిరాయుడితో కలిసి మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు.  ఈ క్రమంలో 43.5 ఓవర్లో శామ్యూల్స్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ మైలురాయిని దాటాడు. మరో ఎండ్‌లో రాయుడు(73) ఔటయ్యాక క్రీజులోకొచ్చిన ధోనీ (20), పంత్‌ (17) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ప్రస్తుతం భారత్‌ స్కోరు  46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు. కోహ్లీ 115 పరుగులతో అజేయంగా ఉన్నాడు.