ఆ అభిమాని కోసం విరాట్ ఏం చేశాడో చూశారా ?

ఆ అభిమాని కోసం విరాట్ ఏం చేశాడో చూశారా ?

విరాట్ కోహ్లీకి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పక్కర్లేదు.  దేశంలో ఇండియా మ్యాచ్ అంటే భారీ సంఖ్యలో అభిమానులు వస్తుంటారు.  వాళ్ళను కంట్రోల్ చేయడం అంటే పోలీసులకు, మ్యాచ్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పి.  ఒక్కోసారి అభిమానుల ఆగడాలు మాములుగా ఉండవు.  తన అభిమాన క్రికెటర్ ను కలిసేందుకు బారికేడ్ల ను దూకేసి గ్రౌండ్ లోకి పరుగులు తీస్తుంటారు.  

అలా పరుగులు తీసే అభిమానులను పట్టుకొని పోలీసులు బయటకు బలవంతంగా తీసుకెళ్తుంటారు.  అయితే, ఇండియా.. బాంగ్లాదేశ్ మధ్య జరిగిన ఇండోర్ టెస్ట్ లో ఉత్తరాఖండ్ కు చెందిన సూరజ్ అనే అభిమాని బారీకేడ్ దూకేసి గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు.  అప్పటికే అలర్ట్ అయిన సిబ్బంది సూరజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు.  అయితే, కోహ్లీ ఆ అభిమానిని పెట్టుకోవద్దని చెప్పి, దగ్గరికి తీసుకొని భుజంపై చేయివేసి మాట్లాడాడు.  అభిమాన క్రికెటర్ తో మాట్లాడిన ఆ అభిమాని హ్యాపీగా బయటకు వెళ్ళిపోయాడు.  ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.