సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ..

సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ..

ఫార్మాటేదైనా మైదానంలో పరుగుల వరద పారిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో రికార్డును బద్దలుకొట్టాడు. పాకిస్థాన్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇప్పటి వరకు వన్డేల్లో 11 వేల పరుగులను ఎనిమిది మంది ఆటగాళ్లు పూర్తి చేశారు. ఇక.. ఈ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. భారత్‌ తరఫున సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీలు 11వేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.

అందరి కంటే వేగంగా..
11 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న కోహ్లీ.. అందరికంటే ఈ ఫీట్‌ను ఫాస్ట్‌గా సాధించాడు. సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగుల పూర్తిచేయగా.. కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకుని ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.