కోహ్లీకి 12 లక్షల జరిమానా... ఎందుకంటే...?

కోహ్లీకి 12 లక్షల జరిమానా... ఎందుకంటే...?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ కు 12 లక్షల జరిమానా పడింది. అయితే ఐపీఎల్ 2020 లో నిన్న బెంగళూర్-పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ జట్టు వేయాల్సిన 20 ఓవర్లను నిర్ణయిత సమయంలో వేయలేదు. అనుకున్న సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ చేయడంతో జట్టు కెప్టెన్ అయిన కోహ్లికి రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. స్లో ఓవర్ రేట్ కారణంగా కోహ్లికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటె.. నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ పై బెంగళూర్ ఘోరంగా ఓడిపోయింది. మొదట  బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ 206 పరుగులు చేయగా వారి కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒకడే 132 పరుగులు సాధించాడు. ఇక ఆ తర్వాత 207 పరుగుల లక్ష్యాన్ని చూసి బెదిరిన బెంగళూర్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో 17 ఓవర్లలో 109 పరుగులకే ఆర్సీబీ ఆల్ ఔట్ అయ్యింది.