కోహ్లీకి గాయం.. సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఆడతాడా..?

కోహ్లీకి గాయం.. సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఆడతాడా..?

టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. మరో మూడు రోజుల్లో వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడనున్న భారత జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న టీమిండియా ప్రాక్టీస్‌ చేస్తుండగా కెప్టెన్‌ కోహ్లీ చేతి వేలికి గాయమైంది. వెంటనే కోహ్లీ ప్రాక్టీస్‌ సెషన్‌ నుంచి వైదొలిగాడు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడా లేది బ్యాటింగ్‌ చేస్తూ గాయమైందా అనే విషయమై స్పష్టత లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా కోహ్లీ గాయంపై అధికారిక ప్రకటన చేయలేదు.