కోహ్లీ అర్ధశతకం

కోహ్లీ అర్ధశతకం

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీంఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (50; 55 బంతుల్లో 5×4) అర్ధశతకం సాధించాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన 24.3వ బంతికి సింగిల్‌ తీసి అర్ధశతకం పూర్తి చేసాడు. విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇది 50వ అర్ధశతకం. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. కోహ్లీ చక్కటి ఇన్నింగ్స్ తో టీమిండియాను ఆదుకున్నాడు. 28 ఓవర్లకు టీంఇండియా 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజ్ లో విరాట్‌ కోహ్లీ (58), విజయ్‌ శంకర్‌ (41)లు ఉన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం ఇప్పటికే 81 పరుగులకి చేరుకుంది.