క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టుకు 'కోహ్లీ' కెప్టెన్

క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టుకు 'కోహ్లీ' కెప్టెన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి క్రికెట్ ఆస్ట్రేలియా జట్టుకు 'కెప్టెన్'గా ఎంపికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా.. 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్' కెప్టెన్‌గా కోహ్లిని ఎంపిక చేసింది. 2018లో కోహ్లి 14 వన్డేలు ఆడి 133.55 సగటుతో 1,200 పరుగులు చేశాడు. ఈ టీమ్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మకు అవకాశం దక్కింది. రోహిత్ 19 వన్డేల్లో 1,030 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్  బుమ్రాలు కూడా స్థానం దక్కించుకున్నారు. వీరితో పాటు జానీ బెయిర్‌స్టో, జో రూట్, హెట్‌మేర్, జోస్ బట్లర్, థిసార పెరీరా, రషీద్ ఖాన్, ముస్తఫిజుర్ రెహమాన్ క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే జట్టులో స్థానం పొందారు. అయితే టీమిండియా నుండి నలుగురు, ఇంగ్లాండ్ నుండి ముగ్గురు ఉండగా.. ఆస్ట్రేలియా నుండి ఒక్కరు కూడా లేకపోవడం విశేషం.