కోహ్లీ విజ్ఞప్తిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం

కోహ్లీ విజ్ఞప్తిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం

విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ మొత్తం ఆటగాళ్ల వెంట భార్యలు ఉండేలా అనుమతించాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన విజ్ఞప్తిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం అని క్రికెట్‌ పాలకుల కమిటీ(సీఓఏ) తెలిపింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కొత్తగా ఏర్పడే బీసీసీఐ కార్యవర్గానికే వదిలేశాం అని సీఓఏ అధికారి తెలిపారు.

ప్రస్తుత పాలసీ ప్రకారం.. దేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటగాళ్ల వెంట భార్యలు, వ్యక్తిగత సిబ్బందిని కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే టూర్‌ మొత్తం ఆటగాళ్ల సతీమణులను అనుమతించాలని కోహ్లి తొలుత ఓ బీసీసీఐ ఉన్నతాధికారికి తెలిపాడు. అతను వినోద్‌రాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ (సీఓఏ)కి చెప్పారు.