దెబ్బతిన్న విరాట్ మైనపు విగ్రహం

దెబ్బతిన్న విరాట్ మైనపు విగ్రహం

టీమిండియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లి మైనపు విగ్రహం దెబ్బతింది. తాజాగా కోహ్లి మైనపు విగ్రహంను ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో నిర్వాకులు ఆవిష్కరించారు. అయితే కోహ్లి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. కోహ్లి మైనపు విగ్రహంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు  అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ మైనపు విగ్రహం కుడి చెవి పైభాగం స్వల్పంగా దెబ్బతింది.

ఇది గమనించిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు విగ్రహపు చెవి భాగానికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. త్వరలోనే కోహ్లి మైనపు విగ్రహం మళ్లీ యధారూపంకు రానుంది. దెబ్బతిన్న కోహ్లి మైనపు విగ్రహం ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఢిల్లీలోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో అంతకుముందు కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాలను నిర్వాకులు ఆవిష్కరించారు. త్వరలో టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విగ్రహంను కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం.