గులాబీ రంగులో కోల్ కతా నగరం..!!
యమహా నగరి కలకత్తా పురి అని మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది సినిమాలో పాట పడతాడు. ఈ సాంగ్ కలకత్తా నగరం చరిత్రను.. ఆ నగరం ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. కాగా, ఇప్పుడు కోల్ కతా నగరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. టెస్ట్ క్రికెట్ కు శోభను తీసుకొచ్చేందుకు ఐసిసి కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసందే.
ఇప్పటి వరకు వన్డే, టి 20 మ్యాచ్ లు మాత్రమే డే అండ్ నైట్ లు జరిగేవి. కానీ, ఇపుడు టెస్ట్ మ్యాచ్ లు కూడా డే అండ్ నైట్ మ్యాచ్ లుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇండియా, బాంగ్లాదేశ్ జట్లమధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ తో దీనికి శ్రీకారం చుట్టింది. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ల కోసం గులాబీ రంగులో ఉండే బాల్స్ ను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు బంతులను వినియోగిస్తుండటంతో.. దానికి గుర్తుగా నగరంలోని ప్రముఖ కట్టడాలను గులాబీ రంగులోకి మార్చారు. ఇక చారిత్రాత్మకమైన ఈ టెస్ట్ మ్యాచ్ ను తిలకించేందుకు బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రత్యేకంగా ఈడెన్ గార్డెన్ కు వచ్చారు. ఆమెతో పాటుగా బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కూడా ఈడెన్ గార్డెన్ కు వచ్చారు. డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)