చెలరేగిన కోహ్లీ.. నైట్‌రైడర్స్‌ టార్గెట్‌ 176

చెలరేగిన కోహ్లీ.. నైట్‌రైడర్స్‌ టార్గెట్‌ 176

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లోరాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. 176 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ ముందుంచింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (68 నాటౌట్: 44 బంతుల్లో 5x4, 3x6) రాణించడంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్లు మెకల్లమ్‌ (38: 28 బంతుల్లో 4x4, 2x6), డికాక్ (29: 27 బంతుల్లో 3x4, 1x6) తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ.. సమయోచిత ఇన్నింగ్స్‌తో జట్టుకి మంచి స్కోరు అందించాడు. ఆచితూచి ఆడుతూనే చివరి వరకు నిలిచాడు. పరుగుల వరద పారే చిన్నస్వామి పిచ్‌ ఈ మ్యాచ్‌లో కాస్త భిన్నంగా కనిపించింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రసెల్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌ 1 వికెట్‌ తీశారు.